ఉపరాష్ట్రపతిగా నా పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో, గత ఐదేళ్ళను ఓ సారి సింహావలోకనం చేసుకుంటే ఎంతో సంతృప్తిగా ఉంది. దేశాభివృద్ధిలో మార్పునకు సంధానకర్తలుగా వ్యవహరిస్తున్న శాస్త్రవేత్తలు, విద్యార్థులు, వైద్యులు, యువతను కలిసి, వారితో అనేక విషయాలు చర్చించే అవకాశం నాకు లభించింది.